

వినుకొండ :- స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ గ్యారేజీ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి డిపో మేనేజర్ జే. నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి వినుకొండ డిపో నందు ముఖ్య అతిథిగా హాజరై ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిగ్గా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు స్వీపర్స్కు డస్ట్ బిన్ లు మరియు పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆర్టీసీ కుటుంబంలో అందరము సమానమేనని, అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీ శక్తి పథకమును విజయవంతము చేశారని కొనియాడారు. అదేవిధంగా నరసరావుపేట ప్రజా రవాణా శాఖ అధికారి టి. అజిత కుమారి మాట్లాడుతూ జోనల్ చైర్మన్ పల్నాడు జిల్లాలలోని అన్ని డిపోలలో శానిటేషన్ పరికరాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను, ఉద్యోగులను, హమాలీలను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.







