

అందరి అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ పైలెట్ ప్రాజెక్టుని విజయవంతం చేయాలి – వెనిగండ్ల రాము
నా లక్ష్యం నియోజకవర్గంలో పండించిన ప్రతి రొయ్యకు ఒక బ్రాండ్ మరియు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి – వెనిగండ్ల రాము
ఫిషరీస్ డిపార్ట్మెంట్ మరియు రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది– ఆర్డిఓ బాలసుబ్రమణ్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేక దృష్టితో చూసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగింది….
మన ఆక్వా రైతులు పండించే పంట ఎగుమతిని ప్రపంచంలో ఎక్కడికి పంపించాలన్నా మన సాగు విధానము ప్రపంచానికి తెలియజేసే విధంగా హైజినిక్ మరియు టెక్నాలజీ ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ లో భాగంగా మొదటి విడత ఫేజ్ కృష్ణాజిల్లా
నందివాడ మండలం లో జరుగుతుంది
నందివాడ మండలంలోని అరిపిరాల, వెంకటరాఘవపురం, వెన్ననపూడి, తుమ్మలపల్లి, నందివాడ, పుట్టగుంట గ్రామలలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది….
ఈ ఆరు గ్రామాలలో 7700 ఎకరాలు, 727 చెరువులు ఉన్నాయి. ఈ పైలెట్ ప్రాజెక్టు మొత్తం 3 ఫేసెస్ గా చేయడం జరుగుతుంది. మొదటి ఫేస్ లో భాగంగా మూడు నెలలు లో చేస్తాము అని ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. దానిలో భాగంగా మొదటి పేస్ ఇచ్చిన సమయంలో చేయాలి అనే లక్ష్యంతో నిన్న ఆక్వా ఎక్సైజ్ సంస్థను సందర్శించడం జరిగింది.
వేనిగండ్ల రాము ఈ ప్రాజెక్టు లో భాగంగా వారికి ఉన్న ఇబ్బందులు మరియు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా నేనే స్వయంగా రైతులతో మరియు లీజ్ దారులతో జరిగే మీటింగ్లో కూడా పాల్గొంటాను
ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, బిజెపి నాయకులు గుత్తికొండ రాజబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్రావు, గోకవరపు సునీల్, యార్లగడ్డ రాంబాబు, అర్కేపూడి శ్రీనివాసు, RDO బాలసుబ్రమణ్యం, గుడివాడ MRO కిరణ్, గుడ్లవల్లేరు మండల MRO లోకరాజ్, నందివాడ మండలం MRO గురుమూర్తి రెడ్డి,AD ఫిషరీస్ ప్రసాద్, FDO నందివాడ జమాయమ్మ, మరియు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.







