
బాపట్ల 17.9.25 అసంక్రమిత వ్యాధు లురాకుండా మహిళ లు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించు కోవాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ప్రజలకు పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక ఏరియా హాస్పిటల్ లో స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ , శాసనస భ్యులు వేగేశననరేంద్ర వర్మ కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం క్రింద 18 సంవత్సరా లు నిండిన మహిళ లందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైజాగ్ లో ప్రారంభిస్తు న్నారని ఆయన చెప్పారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్2వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఆశా వర్కర్లు,ఎ. ఎన్. ఎం.లు ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ పరీక్షల పై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని ఆయన చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచన మేరకు మందులు వాడుకోవాలని ఆయన చెప్పారు. మహిళలు అవసరం ఉన్న లేకపోయినా కూడా క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయించు కోవాలని ఆయన సూచించారు. బాపట్ల జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది డెంగ్యూ జ్వరాలు పై సర్వే చేపట్టాలని ఆయన చెప్పారు. డెంగ్యూ జ్వరాలు వచ్చిన వారు బ్లడ్ శాంపిల్స్ కొరకు ఎలాంటి నగదును చెల్లించిన అవసరం లేదని జిల్లా వైద్యశాలలో అందుబాటులో ఉంటాయని అని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏరియా హాస్పిటల్ లో వార్డులను ఓపి విభాగాన్ని పరిశీలించారు. ఏరియా హాస్పిటల్ లో రోగులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళల కోసం అన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటి కప్పుడు వైద్య పరీక్షలు చేయించు కోవాలని ఆయన చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మహిళలు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన చెప్పారు. మహిళలు క్యాన్సర్ వైద్య పరీక్షలు చేయించుకొని మొదట దశలోనే మందులు వాడుకొని తగ్గించుకోవచ్చు అని ఆయన చెప్పారు. వైద్య రంగంలో క్యాన్సర్ వ్యాధికి అనేక రకాల మందులు వచ్చాయని మహిళలు భయపడ నవసరం లేదని ఆయన చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాలో మెడికల్ మెడికల్ కాలేజి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా మని ఆయన చెప్పారు. జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ,జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
  
 






