అమరావతి:18 09 2025 :భారతదేశ ఆర్థిక విప్లవానికి నూతన జీఎస్టీ సంస్కరణలు అద్భుతంగా దోహదపడతాయని, ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక సంస్కరణలకు ప్రజలకు, ఆర్థిక ప్రగతికి నాంది పలుకుతుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆయన జీఎస్టీ నూతన సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నూతన సంస్కరణలతో ప్రజలు, పరిశ్రమలకు, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన సంస్కరణలతో పేద మధ్యతరగతి ప్రజలకు పన్నుల భారంలో వెసులుబాటు కలుగుతుందన్నారు. వైద్యం, విద్య,వ్యవసాయ, పరిశ్రమలు రంగాలకు ప్రభుత్వాలు ఊతం ఇచ్చాయన్నారు. నూతన సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రస్తుతం కొంత భారమైనప్పటికీ భవిష్యత్తులో మేలు జరుగుతుందన్నారు. 2017లో మొదలైన జిఎస్టి విప్లవం ఒక దేశం ఒకే పన్ను విధానం ద్వారా గతంలో అస్తవ్యస్తంగా ఉన్న పనుల విధానాన్ని సరిచేసి దాదాపు 17 రకాల టాక్స్ మరో ఆరు రకాల సెజ్ లు ఎత్తివేసి ఓకే పన్ను విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో ఉన్న ఐదు స్లాబ్ లను రెండు స్లాబుల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. 2018లో భారతదేశ జిఎస్టి ఆదాయం 7 లక్షల కోట్లు ఉంటే 2020 నాటికి 12 లక్షలు కోట్లు అయిందన్నారు. తర్వాత ఎట్లా 2024 25 సంవత్సరానికి డబుల్ 24 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. గతంలో 65 లక్షల మంది మాత్రమే జీఎస్టీ పరిధిలో ఉన్నారని విస్తృతమైన సరళీకృత విధానం వల్ల జీఎస్టీ పరిధిలోకి కోటిన్నర లక్షల మంది గత ఏడాది వచ్చారన్నారు. ప్రభుత్వాలు సాధారణంగా ఎన్నికల ముందుకానీ.. ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తాయని హామీలుస్తుంటాయని… అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను పటిష్టంగా అమలు చేసేందుకు నూతన జీఎస్టీ పాలసీకి రూపకల్పన చేశాయన్నారు. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక సంస్కరణలకు నాంది అన్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ,రైతాంగానికి వ్యవసాయ ఉపకరణాలు పనిముట్లు తక్కువ ధరకు లభ్యం కానున్నాయన్నారు. నాచురల్ ఫార్మింగ్ దిశగా బయో పెస్టిసైడ్స్ వినియోగం ఆర్గానిక్ వినియోగం పెరిగేలా , ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులోకి వచ్చేలా విద్యా వనరులను సమకూరుస్తూ తక్కువ ధరకు వస్తువులు అందేలా ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్తూ జిఎస్టి లో సడలింపులు చేశారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా పన్నెండు శాతం స్లాబ్ లో ఉన్న 99% వస్తువులు ఐదు శాతం స్లాబ్ లోకి వచ్చాయన్నారు. అలాగే గతంలో 28% స్లాబ్ లో ఉన్న 90 రకాల వస్తువులు ఈరోజు 18 శాతం స్లాబ్ లోకి వచ్చాయని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ఉదాహరణకు వైద్యరంగంలో 12% స్లాబ్ లో ఉన్న అన్ని రకాల డ్రగ్స్ ఐదు శాతం స్లాబ్ లోకి తీసుకువచ్చారని ఇందులో 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 12% స్లాబ్ లో ఉంటే ఈరోజు వాటిని జీరో టాక్స్ పరిధి లోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఐదు శాతం టాక్స్లు విధించే మూడు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉదాహరణకు క్యాన్సర్ జబ్బులకు వాడే మందులను జీరో ట్యాక్స్ లోకి తీసుకువచ్చారని ఇది చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు. 18 శాతం స్లాబులో ఉన్న మెడికల్ సర్జికల్ ఎక్యుప్మెంట్స్, వెటర్నరీ మందులు హ్యూమన్ ఎనాలసిస్ పరికరాలు ఐదు శాతం స్లాబ్ లోకి వచ్చాయన్నారు. ఆసుపత్రిలో ఓ పి రూ .100 ఉంటే శాతం టాక్స్ కట్టాల్సి వచ్చేదని ఈరోజు ఈ శాతం టాక్స్లోకి తీసుకురావడం జరిగిందన్నారు.
అత్యవసర మందులపై జీఎస్టీ పన్ను లేకుండా చేయడం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో సంపద పెరిగి వస్తువుల వాడకం పెరుగుతుందన్నారు. వ్యవసాయ రంగంలో 18 12% స్లాబులు ఉన్న అనేక రకాల ఇన్పుట్స్ కి ఐదు శాతం పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. గతంలో ఐదు పర్సెంట్ ఉన్న వస్తువులను 0 టాక్స్ లోకి తీసుకొచ్చారని చెప్పారు. ఈ నూతన సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక భారమైనప్పటికీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పేద మధ్యతరగతి ప్రజలకు పరిశ్రమల అభ్యున్నతికి ఆత్మనిర్బర్ భారత్ దిశగా పరిశ్రమల అభ్యున్నతికి ఉపకరిస్తుందన్నారు. వినియోగదారులకు ఉత్పత్తిదారులకు మధ్యలో ప్రభుత్వాలు ఉన్నాయని…. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వానికి 50 లక్షల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు నష్టం వాటిల్లి అవకాశం ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 6000 కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల ప్రతి ఏడాది నష్టం (ఆదాయం టాక్స్ తగ్గడం వల్ల) వస్తుందన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాలకు ఊతమిచ్చేలా గ్రోత్ పెంచాలనే తపనతో ప్రభుత్వాలకు భారమైన సంస్కరణలు అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ సుస్థిర నాయకత్వంతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తుందని పేర్కొన్నారు . అలాగే యువనేత మంత్రి నారా లోకేష్ ఏడాది కాలంలోనే 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించేలా కృషి చేశారన్నారు. 25 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ నూతన జీఎస్టీ రిఫార్మ్స్ ను సక్రమంగా వినియోగిస్తే రాష్ట్రానికి అద్భుతమైన వనరులు సృష్టించే అవకాశం ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో రెన్యువబుల్ ఎనర్జీ 18 12 శాతాన్ని ఐదు శాతం లోకి తీసుకురావడం ద్వారా వినియంలోకి తీసుకురావడం విస్తృత పరచడం ద్వారా పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ లక్ష్యం జీరో ఎనర్జీ దిశగా నడిపేందుకు ఉపయోగపడుతుందన్నారు.
211 2 minutes read