
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యవర్గం అరుదైన వైద్య మైలురాయిని నమోదు చేసింది. 76 ఏళ్ల మేయాస్థీనియా గ్రావిస్ (Myasthenia Gravis – MG) రోగికి పూర్తిగా మేల్కొని ఉన్న స్థితిలోనే (Awake Cardiac Surgery) గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి.

రోగి గుండెకు రక్తం అందించే మూడు ప్రధాన ధమనుల్లో తీవ్ర స్థాయి పూడికలు (Triple Vessel Disease) ఉండటంతో పాటు, శ్వాసకోశ కండరాల బలహీనతకు కారణమయ్యే మేయాస్థీనియా గ్రావిస్ వ్యాధి ఉండడంతో సాధారణ అనస్థీషియా ఇవ్వడం ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో Awake Bypass Technique ను ఎంచుకొని, రోగి పూర్తిగా స్పృహతో, స్వయంగా శ్వాస తీసుకుంటూ ఉండే విధంగా శస్త్రచికిత్సను చేపట్టారు. థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా సహాయంతో ఛాతీ భాగానికే మత్తు అందించి, వెంటిలేటర్ అవసరం లేకుండానే సర్జరీని సజావుగా పూర్తిచేశారు.
ఈ అరుదైన శస్త్రచికిత్సను కార్డియోథొరాసిక్ మరియు వాస్క్యులర్ సర్జన్ల బృందం—
డా. జయరామ్ పాయ్, డా. శివప్రసాద్, డా. అశోక్ కుమార్, డా. భరత్ సిద్ధార్థ్, డా. శ్రీకాంత్ మహాపాత్ర
అనస్థీషియా బృందం—డా. లోగనాథన్ చక్రవర్తి, డా. పవన్, డా. హిమబిందు
విజయవంతంగా నిర్వహించారు.
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ—
అంతర్జాతీయ ప్రమాణాలతో శస్త్రచికిత్సలు నిర్వహించే ఆసుపత్రిగా ఆస్టర్ రమేష్ ప్రసిద్ధి చెందిందని, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. గత 37 ఏళ్లలో 25 వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలు, అందులో 2,500కు పైగా క్లిష్టమైన బైపాస్/వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సలు, 3,500కుపైగా పిల్లల గుండె ఆపరేషన్లు జరిగినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి విజయాలు లిమ్కా బుక్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం గర్వకారణమని అన్నారు. ఈ అరుదైన విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యాక రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.
మేయాస్థీనియా గ్రావిస్ వంటి క్లిష్ట వ్యాధులు ఉన్న హృద్రోగులకు ఈ విజయం కొత్త ఆశను అందించిందన్నది ప్రత్యేకం.Awareness session at Aster Ramesh Hospital on the occasion of World Prematurity Day: వరల్డ్ ప్రీమేచ్యూరిటీ డే సందర్భంగా అస్టర్ రమేష్ హాస్పిటల్‌లో అవగాహన సభ
మేయాస్థీనియా గ్రావిస్ ఏమిటి? లక్షణాలు ఏవి?
మేయాస్థీనియా గ్రావిస్ ఒక ఆటో ఇమ్యూన్ నర-కండరాల వ్యాధి, ఇందులో శరీరం తయారు చేసే యాంటీబాడీలు నరాల నుంచి కండరాలకు వెళ్లే సంకేతాలను అడ్డుకోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఈ వ్యాధి ముఖ్యంగా కళ్లకు సంబంధించిన కండరాలను ప్రభావితం చేయడం వల్ల కంటి పై ఊడు పడిపోవడం, చూపు రెట్టింపుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మాట్లాడడం, నమలడం, మింగడం కష్టమవడం, ముఖ కండరాల బలహీనత, చేతులు–కాళ్లలో త్వరగా అలసట, శ్రమ పెరిగే కొద్దీ కండర శక్తి తగ్గిపోవడం సాధారణ లక్షణాలు. తీవ్రమైన పరిస్థితుల్లో శ్వాసకోశ కండరాలు బలహీనపడటం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది. విశ్రాంతి తీసుకున్నప్పుడు కండర శక్తి కొంతవరకు తిరిగి వస్తుందనేది ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం








