పశుగ్రాసాలపై అవగాహన – తక్కెళ్లపాడు గ్రామంలో వారోత్సవాలు
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో పశుగ్రాస వారోత్సవాలు గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా పశుసంవర్ధక అధికారి డా. కే. సత్యనారాయణ హాజరై, పశుగ్రాసాల ప్రాముఖ్యతపై రైతులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. పశుగ్రాస రకాలు, వాటి వాడకంతో పాల ఉత్పత్తి పెరుగుదల, అలాగే ప్రభుత్వ రాయితీలపై లభ్యమయ్యే పథకాలు గురించి వివరించారు. PMDS (Pre-Monsoon Dry Sowing) పద్ధతి ద్వారా పశుగ్రాస సాగు చేసే విధానాన్ని ఆయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులతో ప్రత్యక్షంగా భేటీ అయి, పశుగ్రాసాల స్థితిగతులు పరిశీలించారు. ఐఎస్‌డీపీ ఏడీ డా. టి. మోహన్ రావు , ఫిరంగిపురం పశు వైద్యాధికారి డా. బి. సాల్మన్ సింగ్ , పశువైద్య సిబ్బంది మరియు అనేకమంది పాడిరైతులు పాల్గొన్నారు.