

అయ్యప్ప స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ ధర్మపత్ని సుశీల
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం
రిపోర్టర్ ఎస్ భాస్కర్ రావు
స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నరహరి సత్యనారాయణ దంపతులు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి ముందు స్వామివారికి అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నరహరి బుజ్జాయి చెరుకూరి రాఘవయ్య రాయిని వెంకటేశ్వరావు గురుస్వాములు నిర్వహించారు, అనంతరం మాల ధారణ చేసిన అయ్యప్ప శివ భవాని స్వాములకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో స్వాములు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు








