తాడేపల్లిలో ‘బాబు షూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమం||Babu Surety Scam Guarantee” Event Held in Tadepalli
తాడేపల్లిలో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం
తాడేపల్లి పట్టణంలోని 14వ వార్డులో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” పేరుతో ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఉన్న కూటమి ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలు ప్రజలను మోసం చేయడానికే అని ఆరోపించారు. ‘‘ఒక సంవత్సరం పూర్తయినా ప్రజలకు హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని, ప్రజలు వాటి గురించి ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు,’’ అని వ్యాఖ్యానించారు.
వేమారెడ్డి మాట్లాడుతూ, ఈ దొంగ హామీల వల్ల ప్రతి కుటుంబానికి ఏ విధంగా ఆర్థికంగా నష్టం కలుగుతోందో ప్రజలకు వివరించారు. ‘‘బాబు ఇచ్చిన గ్యారంటీ పేరుతో అందినదేమీ లేదని, ప్రజల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని’’ విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులముడి డేవిడ్ రాజు, తాడేపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల ఎలీషా, జీలగ గాలయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్టిమళ్ల స్నేహ సంధ్య, కార్యదర్శి రోడ్డా ఎలీషా (మాజీ వార్డు మెంబర్), ఎస్టీ నాయకుడు దుర్గారావు, మహిళా విభాగ అధ్యక్షురాలు దర్శి విజయశ్రీతో పాటు అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
పరిశీలించిన నాయకులు ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి చేతిలో రాష్ట్రం ఎలా నష్టపోతున్నదీ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.