
అమరావతి:ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా బడేటి రాధాకృష్ణ (చంటి) నియమితులైన నేపథ్యంలో, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏపీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ (APCoB) చైర్మన్ గన్ని వీరాంజనేయులు బడేటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
https://www.facebook.com/share/v/1CvvjjCK91/?mibextid=wwXIfr Live-గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వక్రోత్సవ వేడుకలను ఘనంగా అక్కినేని నాగార్జున 2 కోట్లు విరాళం
రాష్ట్ర పార్టీ నాయకత్వం చంటి పై ఉంచిన నమ్మకం సముచితమని గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా చంటి కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయడంలో, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో చంటి కి మంచి అనుభవం ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి, తెలుగుదేశం పార్టీ విధానాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
బడేటి రాధాకృష్ణ (చంటి) మాట్లాడుతూ, తనపై పార్టీ అధిష్టానం ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు అండగా నిలవడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఇతర సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని స్పష్టం చేశారు.
ఈ అభినందన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో పార్టీని మరింత బలంగా నిర్మించేందుకు చంటి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.








