
జగ్గయ్యపేట:- పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మండలం, బలుసుపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
కొబ్బరికాయ కొట్టి రూ.10 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు, అలాగే రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 5 గోకులం షెడ్లను ప్రారంభించారు.
అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.NTR VIJAYAWADA News
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో G. నితిన్, పంచాయతీ రాజ్ AE శ్రీనివాస రావు,జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,కాసవరం కాలువ చైర్మన్ కానూరి కిషోర్, కృష్ణ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెలమాటి చంద్రమౌళి (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండెల వెంకటేశ్వర్లు, లక్క అర్జున్, పసల నరసింహారావు, అమ్మనబోయిన ప్రభాకర్, ముసునూరి నాగ పవన్, మందడపు పూర్ణచంద్రరావు, అమ్మనబోయిన నాగరాజు, దూబన కోటి, సైదులు, మార్తి హనుమంతరావు, పఠాన్ కాలేషా, ఏపీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










