chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News:బాల్యవివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థినీలదే-జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల: 21-11-2025:-అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగింది. “ప్రతి బిడ్డకు–ప్రతి హక్కు” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జ్యోతివెలిగించి ప్రారంభించారు. విద్యార్థినులు అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాల్యవివాహాలను అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Bapatla Local News:బాల్యవివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థినీలదే-జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.వి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…బాల్యవివాహాలు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారాయని, వాటిని నిర్మూలించేందుకు విద్యార్థినిలు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “దేశ రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఇచ్చింది. ఆ హక్కులపై అవగాహన పెరిగినప్పుడు మాత్రమే సమాజం ముందుకు సాగుతుంది” అని కలెక్టర్ అన్నారు.

Bapatla Local News:బాల్యవివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థినీలదే-జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.వి

18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేసుకోవడం యువత భవిష్యత్తుకు ఎంతో మంచిదని సూచించారు. తాను కూడా ప్రభుత్వ వసతి గృహంలో చదివి, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని విద్యార్థినులతో మధురానుభూతులను పంచుకున్నారు. “మీ తల్లిదండ్రులు మీకు స్పూర్తి… చదువుతో ముందుకు సాగితే మీరు కూడా ఉన్నత స్థానాల్లో నిలవగలరు” అని ఉద్బోధించారు.మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ రాధామాధవి మాట్లాడుతూ…
బాలల హక్కుల పరిరక్షణలో శాఖ కట్టుబడి పనిచేస్తోందని, చదువు ద్వారానే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలిపారు.కార్యక్రమంలో డీఈఓ పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker