Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుజాతీయ వార్తలు

గుంటూరులో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా

గుంటూరు, సెప్టెంబర్ 14 (రిపోర్టర్): గుంటూరు పోలీస్ కళ్యాణి మండపంలో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంజారా సంఘ నాయకులు, ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సమావేశంలో బంజారా సమాజ అభివృద్ధి, విద్య, ఉపాధి, యువతకు శిక్షణ, మహిళల సాధికారత, బంజారా సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.

రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ – “బంజారా సమాజం ఐక్యంగా ముందుకు సాగితేనే విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో స్థానం బలపడుతుంది. ప్రతి బంజారా ఇంటిలో కనీసం ఒకరు ఉన్నత విద్య పొందేలా చర్యలు తీసుకుంటాం. యువతకు స్కాలర్‌షిప్‌లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వ పథకాలలో మన వాటా పూర్తిగా అందేలా కృషి చేస్తాం” అని స్పష్టం చేశారు.

మహిళా విభాగ రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీమతి సరళ బాయి మాట్లాడుతూ – “బంజారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న స్థాయి పరిశ్రమలకు రుణాలు అందించడం, విద్యా రంగంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం అత్యవసరం. మన తల్లిదండ్రులు చదవలేకపోయినా మన కూతుళ్లు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. దీనికి సంఘం పూర్తి సహకారం అందిస్తుంది” అని తెలిపారు.

https://www.facebook.com/share/v/19enG4s1J1 face book live link

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగం మధుసూదన్ మాట్లాడుతూ – “ప్రతి జిల్లాలో బంజారా బావనాలు నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేశాం. అవి విద్యార్థులకు హాస్టల్‌లుగా, సంఘ సమావేశాల వేదికలుగా ఉపయోగపడతాయి. పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. అలాగే బంజారా చరిత్ర, సంప్రదాయాలను యువతకు పరిచయం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం” అని వివరించారు.

గుంటూరులో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా

యువజన విభాగ అధ్యక్షుడు కుర్ర రామకృష్ణ మాట్లాడుతూ – “యువతే సమాజ భవిష్యత్తు. కెరీర్ గైడెన్స్, ఐటీ శిక్షణ, టెక్నికల్ కోర్సులు నేర్పించేందుకు వర్క్‌షాపులు ఏర్పాటు చేయబోతున్నాం. యువత IAS, IPS, గ్రూప్స్, బ్యాంక్ ఉద్యోగాలు సాధిస్తేనే మన స్థానం బలపడుతుంది. సంఘం అందుకు సహకారం అందిస్తుంది” అని హామీ ఇచ్చారు.

విద్యా కమిటీ సభ్యురాలు శ్రీమతి శాంతమ్మ మాట్లాడుతూ – “పల్లెల్లో చిన్నారులు పాఠశాలకు వెళ్లని పరిస్థితి ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చదువులు మానేస్తున్నారు. అందుకే పుస్తకాలు, డ్రెస్‌లు, స్కూల్ ఫీజుల కోసం సహాయం అందించే కార్యక్రమాలు చేపడతాం. మన పిల్లలు చదివితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని పిలుపునిచ్చారు.

సమావేశంలో సంఘం విస్తరణ, కొత్త జిల్లా కమిటీలు ఏర్పాటు, మహిళలు మరియు యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు, బంజారా సంస్కృతి పరిరక్షణ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు వంటి తీర్మానాలు ఆమోదించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న ప్రతినిధులందరికీ విందు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశం బంజారా సమాజ ఐక్యతను చాటిచెప్పుతూ, భవిష్యత్ కార్యాచరణకు బాటలు వేసింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button