కొరటిపాడు వద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్‌బోర్డ్ కుప్పకూలిన ఘటన – త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
గుంటూరు జిల్లా, కొరటిపాడు:03.09.2025
కొరటిపాడు వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంపై అమర్చిన భారీ సైన్‌బోర్డ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో లోపలికి వెళ్లే ఖాతాదారులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ భవనంలో చైతన్య కాలేజ్ మరియు రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఉండటంతో రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి
“ఘటన సమయంలో ఖాతాదారులు లేదా సిబ్బంది బోర్డు క్రిందిగా లోపలికి,పార్కింగ్ కి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది మరి కరెక్ట్ గా ఐదు నిమిషాలు ముందే బ్యాంకు నుండి ఖాతాదారులు భయటకు లోపలికి వచ్చినట్లు ప్రక్క షాప్స్ వారు తెలిపారు . వచ్చి వెళ్లిన వారు అదృష్టం బాగుంది అదే ముందుపడినట్లాయతే ప్రాణాపాయం జరిగివుండేది అన్నారు.బ్యాంకు అధికారులు వెంటనే పెద్ద శబ్దం రావటంతో భయటకు వచ్చి బోర్డును తొలగించారు