AP NEWS: కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. సానమాండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకార పింఛన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అంతకముందు జనరల్ స్టోర్‌కు వెళ్లి నిర్వాహకుడు కొండా వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతినెలా ఒకటో తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకు 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చాం. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అభివృద్ధి చేస్తాం.. సంపద సృష్టిస్తాం. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని ఆయన వెల్లడించారు.