డా. వాసుదేవ వినోద్ కుమార్ బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
బాపట్ల, సెప్టెంబర్ 13:
డా. వాసుదేవ వినోద్ కుమార్ బాపట్ల జిల్లా నూతన కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఆవరణలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, కలెక్టర్ రేట్ ఏవో మల్లికార్జునరావు సహా ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు.
పలువురు జిల్లా అధికారులు కొత్త కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించనున్నట్లు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరితో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.