

ద్విచక్ర వాహనాల దొంగల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్: వివరాలు వెల్లడించిన ఎస్పీ బి ఉమామహేశ్వర్.
బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో, ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా లాక్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకర్స్ వంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.







