

బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని పలు వార్డుల నందు ఈరోజు ఉదయం కమిషనర్ .జి. రఘునాథ రెడ్డి కర్లపాలెం రోడ్డు మరియు జి.బి.సి. రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఆయన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి స్థానిక సమస్యలు, పట్టణ పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా కు సంబంధించిన అంశాలు తదితర అంశాలను గురించి నేరుగా వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అలాగుననే పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు వార్డుల్లో వారు ప్రతిరోజూ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పౌరులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు సమయపాలనతో విధులకు హాజరై, పారిశుద్ధ్యం నిర్వహణ విషయంలో అలసత్వం వహించకూడదని కమిషనర్ గారు ఆదేశించారు. ప్రధాన రోడ్ల నందు చెత్త నిలువలు ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. డోర్ టు డోర్ కలెక్షన్ తప్పక నిర్వహించాలన్నారు. తడి చెత్త,పొడి చెత్త మరియు మరియు హానికర వ్యర్ధాలుగా వేరు చేసిన తర్వాత మాత్రమే ప్రజల నుంచి సేకరించే విధంగా చూడాలన్నారు.
ఆలాగుననే వివేకానంద మునిసిపల్ పార్కును ఆయన పరిశీలించారు. సుందరీకరణ పనులు దాదాపు పూర్తికావొచ్చిన సందర్బంగా మిగిలిన పనులును కూడా త్వరగా పూర్తి చేయాలనీ గుత్తేదారుని ఆయన ఆదేశించారు.
సూర్యలంక రోడ్డులోని అన్న క్యాంటీన్ ను పరిశీలించిన ఆయన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి,క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని మరియు స్వచమైన త్రాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు







