

బాపట్ల,జనవరి 13 : 1404 వ సంవత్సరం నాటి తామ్ర శాసనాలు. ఆనాడు సూర్యగ్రహణం సందర్భంగా పొన్నపల్లి అగ్రహారాన్ని పెదకోమటి వేమారెడ్డి బ్రాహ్మణులకు దానం చేస్తూ వీటిని వెలువరించారనిపొన్నపల్లి విద్యాభాస్కర్ ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డా.పి సి సాయిబాబు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు1404 వ సంవత్సరం నాటి తామ్ర శాసనాలు. ఆనాడు సూర్యగ్రహణం సందర్భంగా పొన్నపల్లి అగ్రహారాన్ని పెదకోమటి వేమారెడ్డి బ్రాహ్మణులకు దానం చేసిన తామ్ర శాసనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
బాపట్ల ప్రాంతమంతా కూడా 15వ శతాబ్దంలో వెలనాడుగా కొండవీడు రెడ్డి రాజుల సంస్థానం కింద ఉండేది. కొండవీడు ప్రభువైన పెద కోమటి వేమారెడ్డి చెరుకుపల్లి మండలంలోని పొన్నపల్లి అగ్రహారాన్ని నాటి బ్రాహ్మణులకు, పండితులకు దానం చేశారు. ఈ సందర్భంగా తామ్ర శాసనాలను వెలువరించారు.చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో పొన్నపల్లి విద్యా భాస్కర్ పూర్వీకులు 15వ శతాబ్దం నాటి వీటిని భద్రపరిచారు.. ఇవి తెలుగు,సంస్కృత భాషలలో లిఖించబడి ఉన్నాయి. వీటి రచయిత శ్రీ నాథుడు కావడం విశేషం.
కార్యక్రమంలో, పొన్నపల్లి గ్రామస్తులు పి. వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు.











