chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల జిల్లా వైసీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత పార్టీ సమావేశం

బాపట్ల జిల్లా:- వైసీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున అధ్యక్షత వహించగా, పార్టీ నూతనంగా నియమించిన జిల్లా టాస్క్ ఫోర్స్ అబ్జర్వర్ బత్తుల బ్రహ్మారెడ్డి, సెంట్రల్ పార్టీ పొలిటికల్ కోఆర్డినేటర్ కందుల రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

Bapatla Local News :బాపట్ల జిల్లా వైసీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత పార్టీ సమావేశం

ఈ సమావేశంలో
🔹 చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్
🔹 వేమూరు ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు
🔹 రేపల్లె ఇన్‌చార్జ్ ఈ ఊరి గణేష్ బాబు
🔹 పర్చూరు ఇన్‌చార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి
🔹 రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు సమర్థవంతంగా తీసుకెళ్లడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ఉద్యమాలు, కార్యక్రమాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.Bapatla Local News

అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు వేమూరులో పార్టీని ఏ విధంగా పటిష్టంగా నిర్మించామన్న విషయాన్ని సవివరంగా వివరించారు. సమావేశం ఉత్సాహభరితంగా కొనసాగి, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker