chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News:బాపట్ల జిల్లా అమృతలూరు మండలంలో వీధికుక్కల బెడద – ప్రజలు ఆందోళన

బాపట్ల జిల్లా: అమృతలూరు: అక్టోబర్ 14:-బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామాల్లో వీధికుక్కల ఉద్ధృతితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలకేంద్రం అమృతలూరులో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ స్థానికులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసే ప్రమాదం నెలకొంది.ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పని మీద వెళ్తున్న మహిళలు, వృద్ధులు వీధిలో తిరిగే కుక్కల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు కుక్కల దాడులకు లోనై గాయపడ్డ సంఘటనలు నమోదయ్యాయి.

వీధికుక్కల నియంత్రణ కోసం పంచాయతీ అధికారులు, పశువైద్యశాఖ, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి ఏడాది వీధికుక్కల సంఖ్య పెరుగుతోంది. కానీ వాటిని నియంత్రించే చర్యలు కనిపించటం లేదు,” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణభద్రతకు ఇది అత్యంత కీలకమైన అంశంగా పేర్కొంటున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker