Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లా

బాపట్ల జిల్లాలో వరదలు వస్తే ఎదురుకొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందిప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సేస్తాం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

కొల్లూరు,సెప్టెంబర్ 14 : బాపట్ల జిల్లాలో అనుకొని పరిస్థితిలో వరదలు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం రాత్రి కొల్లూరు మండల కేంద్రం యం పి డి ఓ ఆఫీసు నందు రేపల్లె డివిజన్ రెవిన్యూ అధికారి యన్. రామలక్ష్మి, డిపిఓ ప్రభాకర్ లతో కలసి కృష్ణ నది వరదల సుచ్చివేశానపై జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో అనుకొని పరిస్థితిలో కృష్ణ నది వరదలు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.గత సంవత్సరం లో కృష్ణ నది వరదలు వచ్చినపుడు ఎలాంటి చర్యలు చర్యలు తీసుకొన్నారు. వరదలు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయని వాటిని ముందుగానే అంచనా లు వేసుకు దానికి తగినట్టుగా జిల్లా మండల స్థాయి అధికారులు పనిచేయాలన్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతము ఉన్న లంక గ్రామాలలో బొట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.పరివాక ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బొట్లు అందుబాటులో ఉంటాయని, త్రాగునీరు భోజనాలు అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో అందజేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.ప్రజలు ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. జిల్లాస్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి అధికారి వరకు వరదల సూచ్చివేషన్ కు సంబంధించి సమాచారాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. గత సంవత్సరంలో వచ్చిన వరదలను అంచనా వేసుకొని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత శాలక అధికారులను ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కొల్లూరు మండల కేంద్రం ఎంపీడీవో ఆఫీస్ నందు జిల్లాలో అనుకోని పరిస్థితులో కృష్ణ నది వరదలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కీలకమైన శాఖల జిల్లా అధికారులు, డివిజన్,మండల స్థాయి అధికారులకు చుచనాలు ఇవ్వడం జరిగిందన్నారు.
బాపట్ల జిల్లాలో వరదలు వస్తే ఎదురుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరు భయపడవలసిన పనిలేదని ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కృష్ణ నది పరివాహ ప్రాంతాలలో ప్రజలను సురక్ష ప్రాంతాలకు తీసుకురావడానికి బోట్లను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.అంతకుముందు కృష్ణా నది వారధి పై నుంచి కృష్ణ నది నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశంలో విద్యుత్, పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా వైద్య ఆరోగ్య, శాఖ అధికారులు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button