

బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో 1.10 కోట్ల రూపాయిలతో వ్యయంతో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నూతన భవనం ప్రారంభం కార్యక్రమంలో బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ గ్లోరియా, తాసిల్దార్ సలీమా, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ,బాపట్ల మండలం పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.








