
Bapatla :-ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు, దైవజనులు, క్రైస్తవ సోదర సోదరీమణులు మరియు ప్రజలకు అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని సమాజ శాంతి, సౌభాగ్యం కోసం ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ, “ఎల్లలులేని సంతోషాలను బహూకరించే పర్వదినమే క్రిస్మస్. ఏసుక్రీస్తు పుట్టిన ఈ పవిత్రమైన రోజును అందరూ ఆనందంగా జరుపుకోవాలి” అని అన్నారు. అందరిపట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో సంతోషాలను పంచుకోవడమే క్రిస్మస్ అసలైన సారాంశమని తెలిపారు.

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలన్నదే క్రీస్తు బోధనల మూలసారం అని చెప్పారు. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధ్యమని క్రీస్తు తన జీవితంతో ఆచరించి చూపారని తెలిపారు.
నేటి యువత ఏసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చర్చ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.Bapatla Local News










