
బాపట్ల జిల్లా:11-10-2025:-ఏడు వ రాష్ట్రస్థాయి క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవాలు – 2025 సందర్భంగా, శనివారం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాకారుల సెలెక్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., యువత క్రీడలవైపు దృష్టి సారించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇలాంటివి కేవలం క్రీడలు కాదు, జిల్లాలోని ప్రతిభావంతులకు రాష్ట్రస్థాయికి మెరుగైన వేదికలు కావాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి. గ్లోరియా, చంద్రశేఖర్, యన్. రామలక్ష్మి, తహశీల్దార్ సలీమా షేక్, జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు చి. హెచ్. సురేష్ బాబు, జాయింట్ సెక్రటరీ బి. ఓంకార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు సలీమా షేక్, అర్జున్ పాల్గొన్నారు.
అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంలో భాగంగా యం. శ్రీనివాసులు, యం. నాగేశ్వరరావు, జిల్లా క్రీడా అధికారి (డిఎస్‌ఓ) పాల్, డిఎం & హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, ఇతర రెవిన్యూ అధికారులు, తహశీల్దార్లు, వీఆర్ఓలు, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎంపికల ద్వారా జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని పొందనున్నారు.






