
బాపట్ల: డిసెంబర్ 11 2025:-“వైయస్ జగనన్న మన లీడర్, కోన రఘుపతి మన నాయకుడు… వీరిద్దరి విజయానికి మేమంతా సిద్ధం” అని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య పేర్కొన్నారు.
ఈరోజు బాపట్ల పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైయస్ జగనన్న స్ఫూర్తితో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల జిల్లా సాధకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు హాజరయ్యారు. చల్లా రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో బాపట్ల జిల్లా స్థాయిలోని దివ్యాంగులకు కోన రఘుపతి గారు తన చేతుల మీదుగా దుప్పట్లు అందజేశారు.
ఈ సందర్భంగా కోన రఘుపతి గారు మాట్లాడుతూ, మాజీ సీఎం వైయస్ జగనన్న ప్రభుత్వ హయాంలో పర్సంటేజ్‌లతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశామని గుర్తు చేశారు.Bapatla Local News ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న దివ్యాంగుల పింఛన్లను కూడా తొలగించడం అన్యాయమని, ఈ అక్రమ విధానాన్ని పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని మీడియా ద్వారా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, దివ్యాంగుల విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్, మాజీ వైసీపీ నాయకులు మనోహర్ డేవిడ్, సీనియర్ నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, దివ్యాంగుల నాయకులు గుంజి ఏడుకొండలు, అలాగే బాపట్ల జిల్లా అన్ని నియోజకవర్గాల వైసీపీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.







