
Bapatla:13-11-25:-విశాఖలో గోమాంసం నిల్వ ఘటనపై తాను ఎలాంటి సంబంధం లేనని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు తెలిపారు.“గోమాంసం దొరికిన యజమాని సుబ్రహ్మణ్యం గుప్తా నా అనుచరుడు కాదు, నా స్నేహితుడు మాత్రమే. అతనితో నేను కేవలం షటిల్ ఆట ఆడుతూ ఉంటాను. అతనికి చెందిన కోల్డ్ స్టోరేజ్‌ను లీజుకు ఇచ్చారు. అక్కడ గోమాంసం నిల్వ చేస్తున్నారని అతనికి తెలియదు. అటువంటి వ్యాపారాలకు ఎవరూ లీజు ఇవ్వరు. గోమాంసం నిల్వ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే మాంసం కాల్చివేయమని అతనే ఆదేశించాడు. గోమాంసం నిల్వ చేసిన వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు,” అని ఎమ్మెల్యే వివరించారు.
అలాగే తాను ఆ వ్యాపారంలో భాగస్వామి అన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
“నా వ్యాపారాలు నాకు ఉన్నాయి, వాటిని నేనే చూసుకుంటాను. ఇతరుల వ్యాపారాల్లో జోక్యం చేసుకోను. నేను చేసే ప్రతి వ్యాపారం నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగానే ఉంటుంది. తప్పు మార్గంలో ఎప్పుడూ నడవను,” అని వేగేశన నరేంద్ర వర్మ గారు తెలిపారు.







