ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
ఆదివారం ఉండవల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు మర్యాద పూర్వకంగా వారితో భేటీ అయ్యారు
ఈ సందర్బంగా నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గురుంచి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు వివరించారు,సంవత్సర పాలనలో బాపట్ల నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్య మంత్రి గారికి నరేంద్ర వర్మ గారు తెలియచేశారు.
అదే విధంగా రాబోయే రోజుల్లో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మరియు రాబోయే రోజుల్లో వివిధ శాఖల వారీగా చెప్పట్టే రూ. 97,18,00,000/- ల అభివృద్ధి కార్యక్రమాల మీద సిద్ధం చేసిన ప్రణీలికలను మరియు ప్రతిపాదానలను ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు అందచేశారు. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే P4 లో భాగంగా బాపట్ల పట్టణం లోని బెతని కాలినిలో నివాసం ఉంటున్న చిన్నారులు సందీప్, హేమ శ్రీ లను నరేంద్ర వర్మ గారు దత్తత తీసుకున్న విషయం ని ప్రస్థావించి వారిని ప్రత్యేకంగా అభినందించారు.