BAPATLA NEWS: సహకార సంఘాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు.
BAPATLA COLLECTOR MEETING
ఉమ్మడి జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చేయుటలో అధికారుల అలసత్వంపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తి పరిచారు. కంప్యూటరీకరణ ఆలస్యమునకు గల కారణాలపై అధికారులతో ఆయన ఆరా తీశారు. గుంటూరు జిల్లా పరిధిలోని 44 సహకార సంఘాలలో 32 సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చేయడమైనది అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. మిగిలిన 12 లో 8 వివరాలను వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా డిసిసిఎం జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రకాశం జిల్లాలోని 68 సహకార సంఘాలలో 36 కంప్యూటరీకరణ చేయడమైనదని, మిగిలిన 32లో 22 సంఘాల వివరాలను 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకాశం జిల్లా సీఈవో జిల్లా కలెక్టర్ కు వివరించారు. గుంటూరు జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 6 సంఘాల వివరాలు కంప్యూటరీకరించుటలో వచ్చే సమస్యలను పరిష్కరించవలసిందిగా పై అధికారులకు తెలియజేయడమైనదని, వారి నుండి పరిష్కార మార్గం తెలిపిన వెంటనే మొత్తం వివరాలను కంప్యూటరీకరుణ చేయుటకు చర్యలు తీసుకుంటామని ప్రకాశం, గుంటూరు జిల్లాల సీఈవోలు కలెక్టర్ కు తెలిపారు.వివరాలను కంప్యూటరీకరణ చేయుటకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.