ఆంధ్రప్రదేశ్

Bapatla news :జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పేర్కొన్నారు.

గురువారం అమరావతి సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్, ఎంఐ ట్యాంకులు, గ్రౌండ్ వాటర్, పీఎం- కుసుమ్ కు సంబంధించిన భూ సమస్యలు, పెన్షన్లు, సానుకూల ప్రజా దృక్పథం, యూరియా లభ్యత, ధర నిర్ణయం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశం మందిరం నుండి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మాట్లాడుతూ, పి. ఎం కుసుమ్ పథకం కింద జిల్లాలోని 22 ఫీడర్లకు 7 సబ్ స్టేషన్ల పరిధిలో 17 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి 82.5 ఎకరాల భూమిని రైతుల వద్ద నుండి తీసుకుంటున్నట్లు అయన తెలిపారు. సూర్యలంక బీచ్ దగ్గర గల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రమునకు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని, 2015 సంవత్సరంలో మంజూరు చేసిన పనులలో 70% పనులు పూర్తయినట్లుగా, మిగిలిన 30% పనులను త్వరలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడమైనదని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న ఆరోగ్య మరియు వికలాంగుల పింఛన్లలో వారి యొక్క సదరం ధ్రువీకరణ పత్రాల పునః పరిశీలనలో భాగంగా అర్హత ఉండి పింఛన్ నిలుపుదల అయినటువంటి లబ్ధిదారులు ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని, వారి సదరం ధ్రువీకరణ పత్రాలను మరోసారి పునః పరిశీలన చేయడం జరుగుతుందని, ఆ దశలో అనర్హులుగా తేలిన ఎడల వారికి పింఛన్ నిలుపుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పింఛన్ కొరకు దరఖాస్తు చేయనటువంటి వారికి పింఛన్ నిలుపుదల చేయడం జరుగుతుందని అన్నారు.

మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు కాలువలలో పూడిక తీత తదితర పనులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు నీటి సంరక్షణ పనులను విరివిగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్సీ ఆంజనేయులు, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, డిఎం మార్క్ఫెడ్ కరుణశ్రీ,మహిళా శిశు సంక్షేమ అధికారి రాధా మాధవి, ఏ ఏ ఓ అనురాధ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker