chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA NEWS:పవన్ కళ్యాణ్ పిలుపుతో జోరందుకున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు – బాపట్లలో ఘనంగా నిర్వహణ

బాపట్ల, ఫిబ్రవరి 26: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఉత్సాహభరితంగా జరిగింది. పట్టణంలోని పటేల్ నగర్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

BAPATLA PAWAN KALYAN PILUPUTHO,FEBRAVARY:ఈ సందర్భంగా విన్నకోట సురేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. ఉద్యమి సభ్యత్వం కేవలం పార్టీ గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి కార్యకర్తకు రక్షణ కవచంలాంటిదని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు సభ్యత్వం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని, జనసేన పార్టీ తన కార్యకర్తల పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

BAPATLA NEWS:పవన్ కళ్యాణ్ పిలుపుతో జోరందుకున్న జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు – బాపట్లలో ఘనంగా నిర్వహణ

ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ఈసారి సభ్యత్వ నమోదు మరింత విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ వివరించి జనసేన కుటుంబాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమి సభ్యత్వం పార్టీ తరఫున ఇచ్చే ఒక పెద్ద భరోసా అని ఆమె తెలిపారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టుపాటి శ్రీకృష్ణ, దయాసింగ్, ఏసోబు, కారుమూరి ఆంజనేయ, కొక్కిరాల రాజేంద్ర, పసుపులేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker