
బాపట్ల:డిసెంబర్ 24:-బాపట్ల నియోజకవర్గ ప్రజలకు బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
నియోజకవర్గంలో నివసిస్తున్న క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.bapatla news ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ సందేశాన్ని అందించేందుకు ఏసుక్రీస్తు జన్మించారని, ఆయన సర్వమత శాంతి స్థాపనకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.










