
బాపట్ల :08-12-25:- క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో హెవెన్లీ వర్షిప్ టీం ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని విలియంత్ కాలేజీ నుండి టీచర్స్ కాలనీ వరకు వెళ్లి తిరిగి అంబేద్కర్ సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసింది.
ర్యాలీలో పిల్లలు, పెద్దలు, ప్రముఖ పాస్టర్లు, వర్షిప్ టీం సభ్యులు పాల్గొని క్రీస్తు గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. క్రీస్తు దీవెనలు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

గత నాలుగేళ్లుగా ఎక్కడా కనిపించని విధంగా ఈ ర్యాలీని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని హెవెన్లీ వర్షిప్ టీం నిర్వాహకుడు ఎం. జాన్ బిన్నీ తెలిపారు.







