
బాపట్ల :12-12-25:-పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం మంగళవారం ప్రజల సందోహంతో సందడిగా మారింది. బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ — సీవీఏపీ (P-4) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల అర్జీలు, పిర్యాదులు, వినతులు వరుసగా అందాయి.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు హాజరైన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ప్రతి పిర్యాదును శ్రద్ధగా విని, సంబంధిత శాఖల అధికారులను వెంటనే పిలిపించి సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గృహ, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్, హౌసింగ్, రేషన్, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి, పెన్షన్ అంశాలు, రహదారి మరమ్మతులు, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను పెద్ద మొత్తంలో సమర్పించారు. ప్రతి సమస్యను నోట్ చేసుకుంటూ,లోనే అధికారులతో చర్చించి ‘సమాధానం వచ్చినంత వరకు ప్రజలకు అండగా ఉంటాం’ అని ఎమ్మెల్యే చెప్పారు.Bapatla Local News“ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ నివారణే నా లక్ష్యం” అని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు కార్యక్రమంలో పేర్కొన్నారు.ప్రజలతో సమావేశమై వారి ఆవేదనలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడంపై ఆయన దృష్టి పెట్టడంతో కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది.







