chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Police Arrest 7 Members in a Sensational Gold Scam Case | బాపట్ల జిల్లాలో సంచలనం: తక్కువ ధరకు బంగారం పేరిట మోసం చేసిన 7 గురు నిందితులను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు

Bapatla Police Arrest 7 Members in a Sensational Gold Scam Case | బాపట్ల జిల్లాలో సంచలనం: తక్కువ ధరకు బంగారం పేరిట మోసం చేసిన 7 గురు నిందితులను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు

వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, స్టువర్టుపురం రెండో గ్యాంగ్‌కు చెందిన అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠా తక్కువ ధరకు బంగారం అమ్ముతామని నమ్మించి, పోలీసుల వేషధారణలో వచ్చి బాధితురాలిని మోసం చేసిన ఘటనలో, వెదుళ్ళపల్లి ఎస్‌ఐ పి. భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి ది:11.01.2026 సాయంత్రం 6.00 గంటలకు చీరాల మండలం తోటవారి పాలెం పోలేరమ్మ గుడి రోడ్డులో నిందితులను అరెస్టు చేశారు.

సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ జి.రామాంజనేయులు గారు కేసు వివరాలను వెల్లడించారు.

నేరం జరిగిన విధానం:
తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలం, పందూరు గ్రామానికి చెందిన మోగిలిశెట్టి శ్రీదేవి @ దేవి అనే మహిళను, స్టూవర్ట్‌పురం రెండో గ్యాంగ్‌కు చెందిన లక్ష్మి @ పీరిగ కళ్యాణి, తన బావ అంగడి చంద్రబాబు, అక్క ప్రసన్న కుమారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారని, ఆ బంగారాన్ని విడిపించుకొని లాభం పొందవచ్చని గత మూడు నెలలుగా మోసపూరిత మాయా మాటలతో నమ్మించింది, వారి మాటలు నిజమని నమ్మిన ఫిర్యాది ది:06.01.2026న తన డ్రైవర్ విజయ్‌తో కలిసి పందూరు గ్రామం నుంచి స్టూవర్ట్‌పురం గ్రామానికి వచ్చారు. ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం, లక్ష్మి @ పీరిగ కళ్యాణి, అంగడి చంద్రబాబు @ చంద్ర, అంగడి ప్రసన్న కుమారి @ అమ్ములు, అంగడి లోహిత్, చిన్నబోతుల భవాని శంకర్ @ సన్నీ, మాదిగాని రామచంద్ర కుమార్ @ పెద్ద పప్పు, అంగడి కావేరి @ దీప్తి, చిట్టి బాబు @ గురవయ్య, కొండేటి హరికృష్ణ మరియు పీరిగ సందీప్ @ నాని కలిసి, పోలీసు వేషధారణలో వచ్చి తమను పోలీసులమని పరిచయం చేసుకుని, “దొంగ బంగారం కొనడానికి వచ్చావా?” అంటూ బెదిరించి ఫిర్యాది వద్ద ఉన్న రూ.6,50,000/- నగదును తీసుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు Cr.No: 02/2026 U/S 319(2), 318(4) r/w 3(5) BNS గా వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చెయ్యడం జరిగింది.

దర్యాప్తు సాగిన విధానం:
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. హరికృష్ణ పర్యవేక్షణలో, వెదుళ్ళపల్లి ఎస్‌ఐ పి.భాగ్యరాజ్ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దర్యాప్తు నిర్వహించారు. నిందితులు ది:11.01.2026 న చీరాల మండలం తోటవారి పాలెం పోలేరమ్మ గుడి రోడ్డులో, ఛీటింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పార్టీ చేసుకుంటున్నారనే కచ్చితమైన సమాచారంతో వెదుళ్ళపల్లి ఎస్ఐ తన సిబ్బందితో ఆప్రదేశానికి చేరుకొని నేరానికి పాల్పడిన 7 గురు నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసినారు. వారిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వద్ద నుండి రూ.4,00,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గౌరవ AJCJ కోర్టులో హాజరుపరచనున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు:

  1. లక్ష్మి @ పీరిగ కళ్యాణి – (A1)
  2. అంగడి ప్రసన్న కుమారి @ అమ్ములు – (A2)
  3. అంగడి చంద్రబాబు – (A3)
  4. చిన్నబోతుల భవాని శంకర్ @ సన్నీ – (A6)
  5. మాదిగాని రామచంద్ర కుమార్ @ పెద్ద పప్పు – (A7)
  6. అంగడి కావేరి @ దీప్తి – (A8)
  7. అంగడి లోహిత్ @ దీపు – (A9)

స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుల వద్ద నుండి రూ.4,00,000/- నగదు స్వాధీనం చేసుకొని కేసు సొత్తుగా సీజ్ చెయ్యడం జరిగింది.

పోలీసుల హెచ్చరిక:
ప్రజలు ఎవరైనా “తక్కువ ధరకు బంగారం అమ్ముతాము” “బ్యాంక్ ఆభరణాలు విడిపించుకోలేకపోతున్నాము” వంటి మాయా మాటలు నమ్మవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ లేదా సమాచారం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు

Bapatla Police Arrest 7 Members in a Sensational Gold Scam Case | బాపట్ల జిల్లాలో సంచలనం: తక్కువ ధరకు బంగారం పేరిట మోసం చేసిన 7 గురు నిందితులను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker