Astonishing Cashew Variety: Bapatla Research Center’s Revolutionary Work for Farmers’ Prosperity||రైతుల అభ్యున్నతికి బాపట్ల పరిశోధన కేంద్రం విప్లవాత్మక కృషి
జీడి మామిడిలో నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, అన్నారు.
జీడిమామిడి పరిశోధన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. జీడి మామిడి అంటుమొక్కల ఉత్పత్తి నర్సరీని ఆయన పరిశీలించారు. పరిశోధన కేంద్రాల్లో లాబరేటరీ పరికరాలు, పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జీడి మామిడి నూతన వంగడాలపై జరుగుతున్న ప్రయోగాలను ఆయన పరిశీలించారు. జీడి విత్తనాలను పరిశీలించారు. ముంథా తుపాను సమయంలో భారీ వర్షాలకు కూలిన పరిశోధన కేంద్రం ప్రహరీ గోడను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కూలీలతోనూ ఆయన మాట్లాడారు.
జీడి మామిడిలో ఉత్పత్తులు పెరిగేలా ప్రయోగాలను విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. బాపట్ల పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేసే అంటుమొక్కలను శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం, అటవీ శాఖ కార్పొరేషన్ కు పంపుతున్నామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఒక్కొక్క మొక్క రూ.50లకు విక్రయిస్తున్నామని కలెక్టర్ కు వివరించారు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాల ఫలాలను రాష్ట్రవ్యాప్తంగా అందించాలన్నారు.
ఆయన వెంట ఉద్యానవన సీనియర్ శాస్త్రవేత్త, పరిశోధన కేంద్రం అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు