

బాపట్లలో స్ఫూర్తిదాయకమైన రీతిలో కాపు వనసమారాధన ప్రశంసనీయం…. రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు
బాపట్ల మండలం సూర్యలంక ఫారెస్ట్ జీడిమామిడి తోటలో అంగరంగ వైభోగంగా మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ సమక్షంలో జరిగిన కాపు వనసమారాధన లో పాల్గొని కాపు జాతిని ఉద్దేశించి తన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించిన ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర మాట్లాడుతూ, దాతల సహకారమే కాకుండా శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి చొరవతో అక్షరాల ఇరవై మూడు లక్షల రూపాయల రొక్కాన్ని (Rs 23,00000/_) ప్రతిభా పురస్కారాల పేరుతో కాపు విద్యార్ధిని విద్యార్ధులకు అందించటం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. విద్యార్ధులకు పెద్ద ఎత్తున అందజేస్తున్న విద్యా పురస్కారాలతో పాటు పేద మరియు వితంతు మహిళలకు జీవనోపాధి కోసం కుట్టు మిషన్ లు మొదలగు పరికరాలను అందించటం కూడా ఒక మంచి సాంప్రదాయకమైన చరిత్ర అని తెలియ జేశారు. తమ కాపు సామాజిక వర్గాల వారు అన్ని రంగాలలో ను బలపడుతూ మిగిలిన వారికి ఆదర్శప్రాయంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడిన తాండ్ర సాంబశివరావు ను మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ తో పాటు కాపు సేవా సంఘం పెద్దలు ఘనంగా సన్మానించి మూమెంటో ను అందించారు. శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ సూచనలు సలహాలతో అద్భుతంగా సేవలు అందిస్తున్న బాపట్ల కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తో పాటు కాపు సేవా సంఘం పెద్దలు అందరికి మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ మరియు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తో పాటు కాపు కుటుంబీకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐ ఎ ఎస్ అధికారి శ్రీ లక్ష్మీకాంతం ను మాజీ MLC అన్నం సతీష్ ప్రభాకర్ తో పాటు కాపు సేవా సంఘం పెద్దలు ఘనంగా సన్మానించి సత్కరించారు.
మాజీ MLC అన్నం సతీష్ ప్రభాకర్ చేతుల మీదుగా కాపు విద్యార్ధిని విద్యార్ధులకు పురస్కారాలు అందించటమే కాకుండా, వివిధ రంగాలలో ప్రావీణ్యత పొంది రాణించిన కాపు జాతి ఉద్యోగులకు సన్మాన సత్కారాలు ఏర్పాటు చేసారు. కాపు జాతి కోసమే కాకుండా పేద, బడుగు బలహీన వర్గాల వారి కోసం శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ చేస్తున్న సేవలకు గాను బాపట్ల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నం సతీష్ ప్రభాకర్ కు ఘన సన్మానం ఏర్పాటు చేసి మూమెంటో ను అందించారు.
అనంతరం పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమంలో వేల మంది కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు కుటుంబీకులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బాపట్ల కాపు సేవా సంఘం గౌరవాధ్యక్షులు పర్వతరెడ్డి భాస్కరరావు, అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, బాపట్ల రోటరీ క్లబ్ మరియు ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, కాపు సేవా సంఘం పెద్దలు రాఘవరావు, వెంకటరావు, కోటికలపూడి సురేష్, భీమా వెంకట కోటేశ్వరరావు, శీలం శ్రీనివాసరావు, పాలెం సుబ్బారావు, అలపర్తి శ్రీనివాసరావు, ఇనపగోళ్ళ రంగారావు, ఇమ్మడిశెట్టి లక్ష్మణరావు, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, గుండ్రెడ్డి సత్యనారాయణ, అడ్వకేట్ సత్యప్రసాద్, సుంకర శేషగిరి రావు, గోపాలం రఘుపతి రావు, బాబ్జీ, చలికొండ వెంకట కృష్ణారావు, రుక్మదరరావు మొదలగు వారు పాల్గొన్నారు.







