

బాపట్ల జిల్లా ను స్పోర్ట్స్ లో ముందుకు నడిపించుటలో భాగంలో క్రీడా మైదానాలకి అనువైన ప్రదేశము ఎక్కడెక్కడ ఉన్నవి గుర్తించడం జరిగిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి తెలిపారు.
ముందుగా జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలసి జిల్లా లో క్రీడల అభివృద్ధి పై కలెక్టర్ తో చర్చించారు.అనంతరం బాపట్ల జిల్లా కేంద్రంలో ని
వ్యవసాయ కళాశాల క్రీడా మైదానం, బాపట్ల మినీ స్టేడియం, చీరాల ఇండోర్ స్టేడియం, హైదర్ పెట్ ఓపెన్ స్థలము మరియు వాటర్ స్పోర్ట్స్ కి అనువైన ప్రదేశములు నాగరాజు కాలువ, పాండురంగాపురం బీచ్, సూర్యలంక బీచ్, చీరాల ఓడరేవును పరిశీలించడం జరిగినది. ఎక్కడెక్కడ అయితే క్రీడాకారులకు అనువైన ప్రదేశములు, వాటర్ స్పోర్ట్స్ కి ఉపయోగకరంగా ఉన్నాయిని వాటర్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఏ.శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.







