

బాపట్ల భీమావారి పాలెం 20వ వార్డు తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు, పెద్దలు గౌరవనీయులు డేగల వర ప్రసాద రావు గారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది..
తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, తమకు వ్యక్తిగతంగా తీరని లోటు అని 20వ వార్డు అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు జిట్టా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీన అనగా నిన్న ఉదయం 6:30 నుంచి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పెన్షన్ దారులను పలకరిస్తూ తనదైన వాగ్దాటితో చలాకీగా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న డేగల వరప్రసాదరావు ఇకలేరు అనేది జీవించుకోలేని విషయమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు జిట్టా శ్రీనివాసరావు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జిట్టా కన్యాకుమారి..







