

బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని వ్యాపారులు, దుకాణదారులకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్రింద తెలిపిన నంబర్ 9392084710 గాని లేదా ఏ ఇతర నంబర్ ల నుండి గాని ఫోన్ కాల్స్ ద్వారా డి & ఓ (ట్రేడ్) లైసెన్స్ ఫీజులు చెల్లించమని ,అధికారులమని చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనరు వారి దృష్టికి పలు ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా కమిషనరు శ్రీ .జి .రఘునాధరెడ్డి గారు మాట్లాడుతూ, కార్యాలయము తరఫున ఫోన్ కాల్స్ ద్వారా లేదా వ్యక్తిగత యూపీఐ, బ్యాంక్ ఖాతాలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో జరగదని స్పష్టం చేశారు. ట్రేడ్ లైసెన్స్ సంబంధిత అన్ని చెల్లింపులు పురపాలక సంఘ ఖజానా, అధికారిక కౌంటర్లు లేదా ప్రభుత్వం అనుమతిచ్చిన ఆన్లైన్ పోర్టల్స్ ద్వారానే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇటువంటి మోసపూరిత కాల్స్‌కు వ్యాపారులు, దుకాణదారులు స్పందించకుండా తమ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘము పేరుతో ఎవరైనా ఫీజులు కోరితే వెంటనే పురపాలక సంఘ కార్యాలయమునకు తెలియజేయాలని సూచించారు…







