
బాపట్ల:25 -11-25:- 23వ వార్డ్ వివేకానంద కాలనీలో ఆధునికంగా అభివృద్ధి చేసిన మున్సిపల్ పార్క్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్తో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు రిబ్బన్ కట్ చేసి పార్క్‌ను ప్రజలకు అంకితం చేశారు.పార్క్ అభివృద్ధి పనులు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు వినోదానికి అనుకూలంగా వివిధ సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, నాటక అకాడమీ డైరెక్టర్ మందపాటి ఆంధ్రెయ, వార్డు ప్రెసిడెంట్ ధర్మేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







