

జాతీయస్థాయి యోగా పోటీలకు వేదిక కానున్న బాపట్ల నియోజకవర్గం…
ప్రతిష్టాత్మకంగా నిర్వహించి యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుదాం…
బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు..
బాపట్ల మండలం జిల్లేళ్లమూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన జిల్లేళ్లమూడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం డిసెంబర్ 27,28,29 తేదీలలో శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయస్థాయి యోగాసన పోటీలు జరగనున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ :-
బాపట్ల మండలం జిల్లేళ్లమూడి గ్రామంలో జాతీయస్థాయి యోగాసన పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పేర్కొన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక కాబడిన అభ్యర్థులు ఈ పోటీలకు తరలి రానున్న నేపథ్యంలో వారికి వసతి,బస, భోజనం తదితర ఏర్పాట్లు అదేవిధంగా పోటీలు జరిగే ప్రదేశం, సభాస్థలి వంటి వివిధ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలువురు మంత్రులు, అతిధులను ఆహ్వానించి , ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం ద్వారా యోగ విశిష్టతను మరో మారు సమాజానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్ర యోగ అసోసియేషన్ అధ్యక్షులు కళ్ళం హరినాద్ రెడ్డి, కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, శీలం శ్రీనివాసరావు, రెడ్డి నాగరాజు, డాక్టర్ సిద్ధార్థ, వీరభద్ర రావు, పిన్ని బోయిన శ్రీమన్నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








