
బాపట్ల: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు ఈ నెల 24వ తేదీన (మంగళవారం) జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని ‘న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్’లో ఉదయం 9:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

ఈ సమావేశానికి జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని, శాఖల వారీగా జరుగుతున్న పనులను ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ మరియు జడ్పీటీసీ సభ్యులు పాల్గొంటారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని పనులకు సంబంధించిన పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారుhttp://BAPATLA NEWS







