
బాపట్ల, మార్చి 24: ‘అవును! మనం TBని అంతం చేయగలం – భారత్ నాయకత్వంలో, జనభాగస్వామ్యంతో’ అనే నినాదంతో బాపట్ల జిల్లాలో 100 రోజుల టిబి ముక్త భారత్ అభియాన్ (TBMBA 2.0) కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదాయ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ, దేశం నుండి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. త్వరిత నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స ద్వారా టిబిని నివారించవచ్చని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. టిబి చికిత్స పూర్తిగా ఉచితంగా అందించబడుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలో 22 పంచాయతీలను టిబి రహిత పంచాయతీలుగా గుర్తించి, వారికి సర్టిఫికేట్లు, మహాత్మా గాంధీ ప్రతిమలను అందజేశారు. టిబి నిర్మూలనలో విశేష కృషి చేసిన పలువురు హెల్త్ వర్కర్లను కూడా ఈ సందర్భంగా గౌరవించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ గారు, డీలర్ డాక్టర్ వి సోమల నాయక్, డిఎన్ఎమ్ఓ డాక్టర్ సాదిక్ గారు, NTEP సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS







