
Baparla Local News :భాష ప్రయుక్త రాష్ట్రాల సాధనకు పొట్టి శ్రీరాములు స్పూర్తిదాయకం-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.విసోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.Bapatla Local News అనంతరం పీజీఆర్ఎస్ హాల్‌లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌వో జి. గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ అనంత రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు.







