
బాపట్ల:-బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, సూరేపల్లి గ్రామంలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత సంతోషంగా, శాంతియుతంగా జరిగాయని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుకలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా సంఘం యూత్ సభ్యులు వేడుకలను చక్కగా నిర్వహించారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.

అలాగే, బయటి గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా సూరేపల్లిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో బాగా జరిగాయని ప్రశంసించారు. పది సంవత్సరాలుగా ఇదే సంప్రదాయంతో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యురుగేంపు కార్యక్రమం కూడా ఆనందోత్సాహాల మధ్య సాగిందని పేర్కొన్నారు.Bapatla Local News
బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఆతిథ్యంతో స్వాగతిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుకలకు సుమారు 500 మంది వరకు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. గ్రామ ఐక్యతను చాటేలా జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలు అందరిలో ఆనందాన్ని నింపాయి.










