
హైదరాబాద్: 17-10-25;_స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్ట సవరణ చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం, బీసీ సంఘాల జేఏసీ శనివారం నిర్వహించనున్న తెలంగాణ బంద్‌కు జన సమితి పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు

.బంద్ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని ఆయన లుపునిచ్చారు.పార్టీ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పి.ఎన్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఉన్న బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉందని అన్నారు.







