
బాపట్ల:-సమాజంలో సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న బీసీలు నేటికీ తగిన స్థానం దక్కించుకోలేకపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎల్ మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం బాపట్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జీవీఎల్ మోహన్ గౌడ్ జిల్లా కమిటీ నాయకుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సంఘం నాయకులతో సమన్వయంతో పని చేస్తూ బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఇటీవల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు జీవీఎల్ మోహన్ గౌడ్‌కు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక పత్రాన్ని అందజేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ వెల్లడించారు.Bapatla Local News అదే సందర్భంగా జిల్లా కార్యదర్శిగా అవ్వారు సాంబశివరావును నియమిస్తూ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చేజర్ల సతీష్, శివకుమార్, జిల్లా కార్యదర్శులు మారం రవికుమార్, ఎన్ ఎస్ పి రాజు, నాయకులు పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, మారం భాను, గోపి, కంకణాల రాంబాబు, ఉల్చి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










