
హైదరాబాద్:03-11-25:- రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

హైదరాబాద్ బషీబాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ, రేపటి నుండి ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సూచించారు.బీసీ బంద్‌లో పాల్గొన్న నేతలపై కేసులు పెట్టడం సమంజసం కాదని, కేసులతో బీసీ ఉద్యమాన్ని అణిచివేయలేరని కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే బీసీ సంఘాల నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు.త్వరలోనే బీసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించిన కృష్ణయ్య, అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.







