
సికింద్రాబాద్:15-10-25:-సికింద్రాబాద్‌లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక చర్చ జరిగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించడం గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక విభేదాలకు దారితీస్తోందని జేఏసీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు మలుపుతిప్పుతున్నాయని వారు విమర్శించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని స్పష్టం చేస్తూ, బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా అమలు చేయాలన్నదే తమ ఆవిధానమని జేఏసీ స్పష్టం చేసింది. బీసీలకు, బీసీ కులాలకు తమ వ్యతిరేకత అన్నది పూర్తిగా నిరాధారమని ఖండించారు.దేశంలో మహారాష్ట్రలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని, అలాంటి పరిస్థితులు తెలంగాణలో రావొద్దన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగానికి మరియు సుప్రీంకోర్టు తీర్పులకు తమ పూర్తి అనుసరణ ఉందని, ప్రభుత్వాలు మరియు ప్రతిపక్షాలు ఈ అంశంపై introspect చేసుకోవాలని హితవు పలికారు.







