
హైదరాబాద్ :23-11-25:-బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 46వ జీవోను నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బషీర్‌బాగ్ చౌరస్తాలో జీవో ప్రతులను దహనం చేశారు. బీసీల రాజకీయ భవిష్యత్తుకు ఈ జీవో గొడ్డలిపేటుగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజ్యాధికారం నుండి దూరం చేసే కుట్రలో భాగంగా జీవో తీసుకొచ్చిందని ఆరోపించిన కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి 42 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించిందని విమర్శించారు.
42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో ఇంకా విచారణలోనే ఉందని, కేసు గెలిచే అవకాశం ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ జీవో 46 ద్వారా బీసీల “నోటికాడ ముద్ద”ను లాక్కున్నట్టయిందని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.







